Narmada River | నదిలోకి 11 వేల లీటర్ల పాలు.. ఆందోళన వ్యక్తంచేస్తున్న పర్యావరణవేత్తలు
Narmada River | ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా నర్మదా నది (Naramada River) లోకి ఏకంగా 11 వేల లీటర్ల పాలను పోశారు. మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాష్ట్రం సీహోర్ జిల్లా (Seahore district) లోని భైరుందా గ్రామం (Bhairuna village) వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే దీనిపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. స్థానిక ప్రజలతోపాటు జలచరాలకు ఈ చర్య ప్రమాదకరమని హెచ్చరించారు.
Narmada River : ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా నర్మదా నది (Naramada River) లోకి ఏకంగా 11 వేల లీటర్ల పాలను పోశారు. మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాష్ట్రం సీహోర్ జిల్లా (Seahore district) లోని భైరుందా గ్రామం (Bhairuna village) వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే దీనిపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. స్థానిక ప్రజలతోపాటు జలచరాలకు ఈ చర్య ప్రమాదకరమని హెచ్చరించారు.
భైరుందా గ్రామంలో ఇటీవల 21 రోజులపాటు ఓ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నదిలోకి 11 వేల లీటర్ల పాలను వదిలారు. అయితే నదిలోని నీటి స్వచ్ఛత కోసం ప్రార్థనలు చేసి, ఆ తర్వాత ట్యాంకర్లతో తెచ్చిన పాలను నర్మదకు సమర్పించడం ద్వారా ఆ నీటిని కలుషితం చేయడం గమనార్హం. దీనిపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేశారు.
నదిలో కలిసిన పాలు సేంద్రియ కాలుష్య కారకంగా మారి నీటిలో ఆక్సిజన్ క్షీణిస్తుందని తెలిపారు. దాంతో నర్మద నీటిపై ఆధారపడిన స్థానికులతోపాటు, ఆ నీటిలోని జలచరాలు ఇబ్బందిపడే ప్రమాదముందని పర్యావరణవేత్త అజయ్ దూబే చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

