భారత్న రత్న లతా మంగేష్కర్ అంత్యక్రియలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఆమె భౌతికకాయానికి ప్రధాని మోదీ నివాళులర్పించారు. నివాళులర్పించిన తర్వాత లతా మంగేష్కర్ కుటుంబీకులు, వైద్యులతో కాసేపు మాట్లాడారు. ఆ తర్వాత సీఎం ఉద్ధవ్, ఆయన భార్య, మంత్రి ఆదిత్యతో కూడా కాసేపు సంభాషించారు. మోదీ తర్వాత… మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోషియారీ, మంత్రి ఆదిత్య, సీఎం ఉద్ధవ్, డిప్యూటీ సీఎం అజిత్ పవార్, క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తదితరులు లతా భౌతికకాయానికి నివాళులర్పించారు. మరో వైపు శివాజీ పార్క్‌కు లతా అభిమానులు, రాజకీయ నేతలు, సినీప్రముఖులు భారీగా తరలివచ్చారు.
మరోవైపు లతా మంగేష్కర్ అంత్యక్రియల్లో పాల్గొనడానికి ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి ముంబై విమానాశ్రయానికి చేరుకున్నారు. మహారాష్ట్ర గవర్నర్ కోషియారీ, మంత్రి ఆదిత్య థాకరే, మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. ముంబై విమానాశ్రయం నుంచి మోదీ నేరుగా శివాజీ పార్క్‌కు చేరుకున్నారు. భారత రత్న లతా మంగేష్కర్ భౌతికకాయానికి నివాళులర్పించారు.