బెంగళూరు: భారత దగ్గు సిరప్ కారణంగా చిన్నారులు మరణించడం ఘోర అవమానమని ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ ఫౌండర్ ఎన్ఆర్ నారాయణమూర్తి పేర్కొన్నారు. ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ ఆరుగురు ప్రముఖులకు మంగళవారం ఇన్ఫోసిస్ అవార్డులు అందజేసింది. ఈ సందర్భంగా నారాయణమూర్తి మాట్లాడుతూ.. ఆఫ్రికాలోని గాంబియాలో భారత్ ఉత్పత్తి చేసిన దగ్గు సిరప్ తాగి 66 మంది చిన్నారులు మరణించారని, అది దేశాన్ని సిగ్గుపడేలా చేసిందని అన్నారు.