Narayana Murthy | ముంబై, మార్చి 12: ఉచితాల ద్వారా పేదరికం పోదని, అలా ప్రయత్నించిన దేశాలు విఫలమయ్యాయని ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అన్నారు. దేశంలో ఉచితాల ద్వారా కాదు.. వినూత్న వ్యవస్థాపకులు సృష్టించే ఉద్యోగాలు పేదరికం తొలగింపునకు సహాయపడతాయనిఆయన తెలిపారు. టైకన్ ముంబై 2025 కార్యక్రమంలో బుధవారం ఆయన మాట్లాడుతూ ఉచితాలు ఇచ్చిన ఏ దేశం కూడా విజయం సాధించ లేదు అని పేర్కొన్నారు.