న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25 : గంగా నది ప్రక్షాళనకు సంబంధించి కేంద్రం చేపట్టిన నమాగి గంగే పథకం నత్తనడకన కొనసాగుతున్నది. దానికి కేటాయించిన నిధుల్లో 2024-25కు కేవలం 69 శాతం మాత్రమే ఖర్చుబెట్టారు. పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రిసెర్చ్ అందించిన వివరాల ప్రకారం 2024మార్చి 31 వరకు 876 కోట్ల నిధులుండగా, అందులో 383 కోట్లను మాత్రమే వివిధ ప్రాజెక్టులకు కేటాయించారు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన 2014-15 నుంచి రెండు సంవత్సరాలు (2000-21, 2021-22) తప్ప అన్ని ఏండ్లు నిధులు తక్కువగానే ఖర్చు చేశారు. దీనికి కేటాయించిన నిధులు వాడకుండా పెద్దయెత్తున పేరుకుపోయిన విషయాన్ని 2024లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) కూడా ఎత్తి చూపింది.