Nandini Gupta | మిస్ వర్డల్ పోటీల్లో నందిని గుప్తా ప్రయాణం ముగిసింది. పోటీల నుంచి నందిని గుప్తా ఎలిమినేట్ అయ్యింది. టాప్ 20లో చోటు దక్కించుకున్నా.. టాప్-8లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయింది. 72వ మిస్వరల్డ్ ఫైనల్ పోటీలు హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఘనంగా జరుగుతున్నాయి. 108 దేశాల అందాల భామలు పోటీల్లో పాల్గొన్నారు. మిస్ వలర్డ్ అమెరికాస్ అండ్ కరేబియన్ టాప్-1లో మార్టినిక్ నిలిచింది. ఆఫ్రికా కంటినెంట్ నుంచి టాప్-1లో ఇథియోపియా, యూరప్ కాంటినెంట్ నుంచి టాప్-1లో పోలెండ్, ఏషియా అండ్ ఓషియానా నుంచి టాప్-1లో థాయిలాండ్ నిలిచింది.
మిస్ వరల్డ్ ఫైనల్ పోటీలకు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ప్రముఖ సినీ నటుడు చిరంజీవి సహా పలువురు ప్రముఖ హాజరయ్యారు. పోటీలకు న్యాయనిర్ణేతలుగా మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లీ, నటుడు సోనూ సూద్, మెఘా ఇంజినీరింగ్ డైరెక్టర్ సుధారెడ్డి, హీరో రానా దగ్గుబాటి, తెలంగాణ ఐఎఎస్ అధికారి జయేశ్ రంజన్, మాజీ మిస్ వరల్డ్ మనూషి చిల్లర్, సినీనటి నమ్రత శిరోద్కర్, డోనా వాళ్ల్ వ్యవహరిస్తున్నారు.