Loksabha Elections 2024 : పార్టీ విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్‌పై వేటుకు ఆ పార్టీ సంసిద్ధమైంది. స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఆయన పేరును తొలగించామని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోల్ వెల్లడించారు.
సంజయ్ నిరుపమ్ ఇస్తున్న ప్రకటనలను హైకమాండ్ పరిశీలిస్తోందని, ఆయనపై చర్యలు చేపడతామని చెప్పారు. కాగా, గత కొంతకాలంగా సంజయ్ నిరుపమ్ పలు అంశాలపై పార్టీ వైఖరితో విభేదిస్తున్నారు. కాంగ్రెస్ తీరుతోనే అశోక్ చవాన్ పార్టీ నుంచి వెళ్లిపోయారని గతంలో నిరుపమ్ చేసిన వ్యాఖ్యలను పార్టీ నేతలు సీరియస్‌గా తీసుకున్నారు.
అశోక్ చవాన్ లేవనెత్తిన అంశాలను పరిష్కరించి ఉంటే ఆయన పార్టీని వీడివెళ్లేవారు కాదని సంజయ్ నిరుపమ్ వ్యాఖ్యానించారు. మరోవైపు నార్త్ వెస్ట్ ముంబై నుంచి టికెట్ ఆశించిన నిరుపమ్‌కు కాంగ్రెస్ మొండిచేయి చూపడం కూడా ఆయన పార్టీపై అసంతృప్తితో ఉన్నారు.
Read More :