Shivarajkumar | కన్నడ సూపర్ స్టార్ (Kannada superstar) శివరాజ్ కుమార్ (Shivarajkumar) అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. వరుస సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్న ఆయన ఇటీవలే శివమొగ్గ నియోజకవర్గం నుంచి లోక్‌సభ బరిలోకి దిగిన తన భార్య గీతా శివరాజ్ కుమార్ (Geetha Shivarajkumar) తరఫున ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం శివరాజ్ కుమార్ అస్వస్థతకు (mild illness) గురైనట్లు తెలిసింది. దీంతో వెంటనే ఆయన్ని బెంగళూరు (Bengaluru) నగరంలోని ఆసుపత్రికి తరలించారు.
అక్కడ చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత రెగ్యులర్ చెకప్‌కోసం మరోసారి ఆసుపత్రికి వెళ్లిన శివరాజ్ కుమార్.. వైద్యుల సూచనల మేరకు మరోసారి అడ్మిట్ అయినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, త్వరలోనే డిశ్చార్జ్ అవుతారని మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి.
Also Read..
Scooter Updating | స్కూటర్ అప్డేట్ కారణంగా ఆఫీస్‌కు లేట్.. కొత్తసాకు దొరికిందంటున్న నెటిజన్లు
Taiwan Earthquake | భారీ భూకంపం ధాటికి 700 మందికిపైగా గాయాలు.. ఏడుకు పెరిగిన మృతులు
Taiwan Earthquake | భారీ భూకంపం.. ఊగిపోయిన భవనాలు, బ్రిడ్జ్‌లు.. VIDEOS