న్యూఢిల్లీ: దేశం పేరును భారత్‌గా మార్చాలని బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి సత్యపాల్ సింగ్ లోక్‌సభలో డిమాండ్ చేశారు. (Country Should Be Changed) రాజ్యాంగంలోని మొదటి పేరాలో ‘ఇండియా’ అంటే ‘భారత్’ అన్న ప్రస్తావన ఉందని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బాగ్పత్ ఎంపీ అయిన ఆయన, సోమవారం లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో మాట్లాడారు. ‘‘ఇండియా’ అనే పదానికి స్వస్తి పలకాలి. ఈ దేశం పేరు భారత్, ఇది విజ్ఞాన శక్తి కేంద్రం. ఇండియా పేరు మారాలి. ఈ దేశం ప్రపంచంలోనే గొప్పది’ అని అన్నారు.
కాగా, భారతదేశంలో జన్మించడం మన అదృష్టమని దేవతలు కూడా చెప్పారని సత్యపాల్ సింగ్ అన్నారు. ఈ మేరకు కొన్ని పురణాలను ఆయన ఉటంకించారు. ఈ నేపథ్యంలో దేశం పేరును భారత్‌గా మార్చాలని లోక్‌సభలో సూచించారు. రాష్ట్రపతి ప్రసంగం ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలకు హామీ అని సత్యపాల్ సింగ్ కొనియాడారు.