నాగ్‌పూర్: జిప్‌లైన్ రైడ్ చేస్తుండగా పై నుంచి కింద పడి 12 ఏండ్ల బాలిక తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలిలో చోటుచేసుకుంది. జూన్ 8న జరిగిన ఈ ప్రమాద ఘటన వివరాలిలా ఉన్నాయి. మహారాష్ట్ర నాగ్‌పూర్‌కు చెందిన త్రిషా బిజ్వే అనే బాలిక వేసవి సెలవులు గడపేందుకు తన కుటుంబ సభ్యులతో కలసి మనాలికి వచ్చింది. అయితే ఆమె జిప్‌లైన్ రైడింగ్ చేస్తుంగా ఆమె జీన్‌కు అనుసంధానించిన తాడు తెగిపోవడంతో 30 అడుగుల ఎత్తు నుంచి కింద ఉన్న లోయలో పడి తీవ్రంగా గాయపడింది.
అక్కడ ప్రమాద రక్షణ ఏర్పాట్లు ఏమీ లేవని, ప్రమాదం జరిగిన తర్వాత కూడా సంబంధిత సిబ్బంది స్పందించ లేదని బాలిక కుటుంబం ఆరోపించింది. దీంతో మనాలిలోని దవాఖానలో ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత ఆమెను చండీగఢ్‌కు తరలించామని, ప్రస్తుతం ఆమె పరిస్థితి ప్రమాదకరంగా ఉందని చెప్పారు. ఈ ప్రమాదానికి జిప్‌లైన్ నిర్వాహకులే బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు.