La Ganesan : నాగాలాండ్ గవర్నర్ లా గణేశన్ (La Ganesan) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూనే తుది శ్వాస విడిచారు. చెన్నైలోని ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న గణేశన్ శుక్రవారం తనువు చాలించారని రాజ్‌భవన్ అధికారి తెలిపారు. ఆయన మరణ వార్త తమను ఎంతో విషాదంలోకి నెట్టిందని ఉపముఖ్యమంత్రి యన్తుంగో పట్టొన్ అన్నారు. పలువురు రాజకీయ ప్రముకులు గవర్నర్ మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు.
‘నాగాలండ్ గవర్నర్, గౌరవనీయులు లా గణేశన్ ఇకలేరనే విషయం తెలిసి చింతిస్తున్నాను. జీవితమంతా ప్రజల కోసమే పాటుపడిన ఆయన విలువలకు కట్టుబడి జీవించారు. అంతేకాదు ప్రజా శ్రేయస్సు, సంక్షేమం విషయలో ఏమాత్రం రాజీపడలేదాయన’ అని నాగాలాండ్ ఉప-ముఖ్యమంత్రి యుతుంగో పట్టోన్ ట్వీట్ చేశారు.
Deeply shocked and saddened by the passing of Hon’ble Governor of Nagaland, Shri La. Ganesan Ji. Throughout his journey in public life, he carried himself with dignity, humility, and an unshakeable commitment to the welfare of the people.
During his tenure in Nagaland, he worked… pic.twitter.com/aAF8Lj0bBJ
— Yanthungo Patton (@YanthungoPatton) August 15, 2025
ఆగస్టు 8 వ తేదీన గణేశన్ చెన్నైలోని తన నివాసంలో కిందపడిపోయారు. ఆ సమయంలో ఆయన తలకు బలమైన గాయం అయింది. వెంటనే కుటుంబసభ్యలు గవర్నర్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు ఐసీయూలో చేర్చుకున్నారు. వారం రోజులుగా ఐసీయూలోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే.. శుక్రవారం ఒక్కసారిగా ఆరోగ్యం విషమించడంతో గణేశన్ కన్నుమూశారు. ఆయన రెండేళ్ల క్రితం అంటే.. ఫిబ్రవరి 12న నాగాలాండ్ 21వ గవర్నర్‌గా నియమితులయ్యారు.
Deeply saddened by the passing of Shri La. Ganesan, Hon’ble Governor of Nagaland.
A devoted patriot, an eloquent orator, and a leader who dedicated his entire life to the service of the nation, he inspired countless people through his simplicity, humility, and unwavering… pic.twitter.com/8AfCUHTpgK— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) August 15, 2025
‘నిబద్ధత కలిగిన దేశభక్తుడు, వాక్ఫటిమ కలిగిన వక్త, దేశ సేవకే జీవితాన్ని ధారపోసిన నాయకుడు గణేశన్. ఆయన తన నిరాడంబరత, మానవతా విలువలు, ప్రజా శ్రేయస్సు పట్ల అమితమైన అంకితభావంతో ఆదర్శంగా నిలిచారు. కొన్నేళ్లుగా నిస్వార్ధంగా గణేశన్ చేసిన సేవలు చిరస్మరణీయం’ అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దివంగత గవర్నర్‌ను ఉద్దేశించిన సంతాప సందేశంలో పేర్కొన్నారు.
Deeply saddened by the passing of Shri La Ganesan Ji, Hon’ble Governor of Nagaland and former Governor of Manipur. He will be remembered for his sincere commitment to the welfare of our state and his devoted service to the nation. My heartfelt condolences to his family and loved… pic.twitter.com/gcOv1DsWzi
— N. Biren Singh (@NBirenSingh) August 15, 2025
‘మణిపూర్ మాజీ గవర్నర్ ప్రస్తుతం నాగాలాండ్ ప్రథమ పౌరుడిగా ఉన్న గణేశన్ కన్నుమూయడంతో చాలా బాధగా ఉంది. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల సంక్షేమం కోసం నిజాయతీగా పాటుపడిన ఆయన సేవలను ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటాం. ఆ కష్ట సమయలో ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.