
చండీగఢ్: ఆకాశంలో వింత కాంతులు కనిపించాయి. దీంతో స్థానికులు ఆందోళనచెందారు. పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. సాయంత్రం 6.50 గంటల నుంచి సుమారు ఐదు నిమిషాలపాటు ఆకాశంలో ఒక వరుసలో వింత వెలుగులు కనిపించాయి. దీంతో స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. కాగా, ఇది ఉపగ్రహమని రక్షణ వర్గాలు ధృవీకరించాయి. ఎలోన్ మస్క్ నేతృత్వంలోని ‘స్టార్‌లింక్’ ఉపగ్రహమని అంతకు ముందు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
ఆకాశంలో ఇలాంటి కాంతులు కనిపించడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది జూన్‌లో గుజరాత్‌లోని జునాగఢ్, ఉప్లేటా, సౌరాష్ట్రలోని సమీప ప్రాంతాల్లో రాత్రివేళ ఆకాశంలో మినుకుమినుకుమంటూ లైట్లు కనిపించాయి. గుర్తించని ఎగిరే వస్తువులు (UFOs) అన్న ఊహాగానాలకు దారితీశాయి.
#WATCH | Mysterious lights were spotted in the sky in Punjab's #Pathankot on Friday evening, leaving the locals stumped. In the video one mysterious lights could be seen blinking in a straight line. The mysterious lights were spotted at around 6.50 pm for five minutes on Friday. pic.twitter.com/6BPyQf9cCj
— Subodh Kumar (@kumarsubodh_) December 3, 2021
#Breaking:🚨 A suspicious object was seen flying over Jammu and Pathankot#isro #nasa pic.twitter.com/KZYyiFKlgf
— OSINT Updates 🚨 (@OsintUpdates) December 3, 2021