గాంధీనగర్: అంతుబట్టని ఓ వ్యాధి గుజరాత్లో కలకలం రేపుతున్నది. ముఖ్యంగా కచ్ జిల్లాలో లఖ్పత్, అబ్దాసా తాలూకాల్లో పరిస్థితి ఆందోళనకరంగా తయారైంది. గత కొద్ది రోజులుగా జ్వరం, నిమోనియా లక్షణాలతో బాధపడుతున్న వాళ్లలో 15 మంది చనిపోవటం కలవరపరుస్తున్నది. మృతుల్లో ఆరుగురు పిల్లలు ఉన్నారు.
11 మృతదేహాల నుంచి శాంపిల్స్ సేకరించి పుణేలోని వైరాలజీ ఇన్స్టిట్యూట్కి పంపామని కచ్ జిల్లా కలెక్టర్ అమిత్ అరోరా చెప్పారు. కారణాలేమితో తెలుసుకోవడానికి సమయం పడుతుందన్నారు. మరణాలకు గల కారణంపై దర్యాప్తు చేపట్టామని, వైద్య బృందాలు త్వరలో నివేదికను అందజేస్తాయని ఆరోగ్యమంత్రి రిషికేశ్ పటేల్ చెప్పారు.