S Janaki | జ్వరంతో ఆస్పత్రికి.. రెండున్నర గంటల్లో మూడుసార్లు గుండెపోటు..!
S Janaki : లెజెండరీ సింగర్ ఎస్.జానకి మరణానికి దారి తీసిన పరిస్థితులను ఆమెకు చికిత్స అందించిన వైద్య బృందానికి హెడ్ డాక్టర్ సంజీవ్ రావు గిరిమజి(Dr.Sanjeev Rao Girimaji) వెల్లడించారు.
S Janaki : సినీవినీలాకాశంలో ధ్రువతారలా వెలుగొందిన నేపథ్య గాయని ఎస్.జానకి(S Janaki) గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. శనివారం రాత్రి 7:00 గంటల సమయంలో మైసూర్లోని అపోలో బీజీఎస్ (Apollo BGS) ఆస్పత్రిలో ఆమె తుది శ్వాస విడిచారు. లెజెండరీ సింగర్ మరణానికి దారి తీసిన పరిస్థితులను ఆమెకు చికిత్స అందించిన వైద్య బృందానికి హెడ్ డాక్టర్ సంజీవ్ రావు గిరిమజి(Dr.Sanjeev Rao Girimaji) వెల్లడించారు. జ్వరంతో హాస్పిటల్లో చేరిన జానకి.. రెండు గంటల్లోనే మూడుసార్లు గుండెపోటుకు గురయ్యారని ఆదివారం ఆయన మీడియాతో చెప్పారు.
సంగీతప్రియులను శోకసంద్రలో ముంచిన దక్షిణాది గానకోకిల ఎస్.జానకి మృత్యువుతో పోరాడి పోరాడి తనువు చాలించారని అపోలో జీబీఎస్ ఆస్పత్రి డాక్టర్ సంజీవ్ రావు గిరిమజి తెలిపారు. ‘శనివారం(జూలై 11) మధ్యాహ్నం 1:00 గంట సమయంలో ఆస్పత్రికి తీసుకొచ్చారు. అప్పుడు ఆమెకు జ్వరంతో బాధ పడుతోంది. బీపీ కూడా చాలా తక్కువగా ఉంది. తొలుత అత్యవసర విభాగంలో.. ఆపై ఐసీయూకి మార్చాం.
#WATCH | Mysuru, Karnataka: On the death of legendary playback singer S. Janaki, Dr. Sanjeev Rao Girimaji, Consultant Physician at Apollo BGS Hospitals, said, “She was brought to hospital emergency around 1 p.m. today afternoon with history of fever when she came. She was quite… pic.twitter.com/JDCKrMXIMu
— ANI (@ANI) July 11, 2026
అంతగర్గత వైద్య సిబ్బంది, న్యూరాలజిస్టులు జానకి ఆరోగ్యాన్ని పరీక్షించి చికిత్స అందించారు. దాంతో కాసేపటికి ఆమె ఆరోగ్యం కాస్త మెరుగైంది. అయితే.. అంతా బాగుంది అనుకుండగా సాయంత్రం 4:30 గంటలకు జానకికి గుండెపోటు వచ్చింది. అప్రమత్తమైన డాక్టర్లు సత్వర చికిత్సతో ముప్పును తప్పించారు. మళ్లీ సాయంత్రం 6:30 గంటలకు గుండెపోటు.. అప్పుడు కూడా వైద్యులు అతికష్టమ్మీద ఆమె ప్రాణాలు కాపాడారు. దురదృష్టవశాత్తూ రాత్రి 7 గంటలకు.. మరోసారి(మొత్తంగా మూడు సార్లు) హార్ట్ ఎటాక్ రావడంతో జానకి కన్నుమూశారు’ అని డాక్టర్ సంజీవ్ రావు గిరిమజి వెల్లడించారు.
People paying their last respects to singer S. Janaki at Maharaja’s college grounds in Mysuru
Video credit: @sriramhindu https://t.co/mi7qHZuyYL pic.twitter.com/w0hlElMASj— The Hindu (@the_hindu) July 12, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

