బుధవారం 03 జూన్ 2020
National - Apr 03, 2020 , 13:49:29

లాక్‌డౌన్‌ ఉల్లంఘన.. తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు

లాక్‌డౌన్‌ ఉల్లంఘన.. తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న విషయం విదితమే. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ, భౌతిక దూరం పాటించాలని కేంద్రంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న విషయం తెలిసిందే. కానీ ఢిల్లీకి చెందిన ఓ పెద్దాయన మాత్రం పదేపదే లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. దీంతో వసంత్‌ కుంజ్‌ పోలీసులకు ఆ పెద్దాయన కుమారుడు ఫిర్యాదు చేశాడు. తన తండ్రి లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి ప్రతి రోజూ రోడ్లపై తిరుగుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కుమారుడి ఫిర్యాదుతో అతని తండ్రిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఢిల్లీలో కరోనా పాజిటివ్‌ కేసుల 293కు చేరుకుంది. నలుగురు మృతి చెందారు. 


logo