సోలన్: హిమాచల్‌లో వరుణుడు బీభత్సం(Himachal Pradesh Flood) సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఆ రాష్ట్రంలోని సోలన్ జిల్లాలో ఉన్న టూరిస్టు కేంద్రం పార్వానులో వరద నీరు ముంచెత్తింది. ఎత్తు ప్రదేశాల నుంచి మట్టి బురుద కొట్టుకువస్తోంది. అయితే ఆ బురద ధాటికి రోడ్డుపై పార్కింగ్ చేసిన వాహనాలు కొట్టుకుపోతున్నాయి. బిల్డింగ్‌ల మధ్య నుంచి ప్రవహిస్తున్న ఆ బురదలో.. కార్లు, చిన్నపాటి ట్రక్కులు కొట్టుకుపోయాయి. బిల్డింగ్ బాల్కనీల నుంచి అరుపులు, కేకలు పెడుతూ జనం బిక్కబిక్కుమంటూ గడుపుతున్నారు. తమ వద్ద ఉన్న మొబైల్స్‌తో ఆ వరద ప్రవాహాన్ని చిత్రీకరిస్తున్నారు. తాజాగా తీసిన ఓ వీడియో వైరల్ అవుతోంది.
Terrible visuals are coming daily…..
Heavy rain wreaks havoc including several shops, houses, and cars being washed away in Himachal Pradesh.
My thoughts and prayers are with people and the tourists stranded due to swelling rivers.#HimachalPradesh pic.twitter.com/jA1dix409Q
— SS Kim (@KimHaokipINC) July 11, 2023
వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడడం వల్ల.. చండీఘడ్-మనాలీ జాతీయ హైవేను బ్లాక్ చేశారు. పలు చోట్ల వరద నీరు రోడ్డును కోసేసింది. షిమ్లా-కిన్నౌర్ రోడ్డు కూడా క్లోజ్ చేశారు. కొన్ని చోట్ల ఆకస్మిక వరదల వల్ల రోడ్లు కొట్టుకుపోయాయి. సుమారు నాలుగు వేల కోట్ల నష్టం వాటిల్లి ఉంటుందని సీఎం సుఖ్విందర్ సింగ్ సుకు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 800 రోడ్లను మూసివేశారు. హిమాచల్ రాష్ట్ర రవాణా సంస్థ సుమారు 1255 బస్సులను నిలిపివేసింది. సుమారు 576 బస్సులు వేర్వేరు ప్రదేశౄల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.