Murder | ఎస్పీ కార్యాలయం ముందే భార్యను దారుణంగా పొడిచి చంపిన కానిస్టేబుల్..!
Murder | అతనో రక్షకభటుడు. తన పరిధిలో ప్రజలకు రక్షణ కల్పించడం అతని విధి. కానీ తన సొంత భార్య పాలిటే అతడు రాక్షసుడయ్యాడు. సాక్షాత్తు జిల్లా ఎస్పీ కార్యాలయం ముందే అతను తన భార్యను దారుణంగా పొడిచి చంపాడు. కర్ణాటక రాష్ట్రం హసన్ జిల్లాలో ఈ ఘటన చేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Murder : అతనో రక్షకభటుడు. తన పరిధిలో ప్రజలకు రక్షణ కల్పించడం అతని విధి. కానీ తన సొంత భార్య పాలిటే అతడు రాక్షసుడయ్యాడు. సాక్షాత్తు జిల్లా ఎస్పీ కార్యాలయం ముందే అతను తన భార్యను దారుణంగా పొడిచి చంపాడు. కర్ణాటక రాష్ట్రం హసన్ జిల్లాలో ఈ ఘటన చేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. లోక్‌నాథ్ అనే వ్యక్తి హసన్ జిల్లాలోని హసన్ నగర్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. గత కొన్నాళ్లుగా ఓ భూమికి సంబంధించిన విషయంలో లోక్‌నాథ్‌కు ఆయన భార్య మమతకు మధ్య గొడవ జరుగుతోంది. ఈ క్రమంలో మమతను లోక్‌నాథ్ రోజూ కొట్టడం, తిట్టడం చేస్తున్నాడు.
ఈ నేపథ్యంలో లోక్‌నాథ్ తనను హింసిస్తున్నాడని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు మమత ఇవాళ (సోమవారం) ఉదయం ఎస్పీ కార్యాలయానికి వెళ్లింది. దాంతో ఆమెను వెంబడించిన లోక్‌నాథ్ ఎస్పీ కార్యాలయం ముందే కత్తితో దారుణంగా పొడిచి చంపాడు.
#WATCH | Hassan, Karnataka: Husband stabs his wife with a knife at the office premises of District Superintendent of Police.
Hassan SP, Mohammad Sujitha says, “A person named Mamata was allegedly stabbed by her husband Loknath…An investigation is underway” pic.twitter.com/JNkr6pCe24
— ANI (@ANI) July 1, 2024
అక్కడే ఉన్న పోలీసులు హుటాహుటిన బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఓ భూమికి సంబంధించి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని, అదే ఆమె హత్యకు కారణమని ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

