పానీయంలో డ్రగ్స్ ఇచ్చి హత్య!
- సొనాలీ ఫోగట్ మృతి కేసులో కొత్త కోణం
పనాజీ, ఆగస్టు 26: హర్యానాకు చెందిన బీజేపీ నాయకురాలు, టిక్‌టాక్ స్టార్ సొనాలీ ఫోగట్ మృతి కేసులో మరో కొత్త కోణాన్ని గోవా పోలీసులు శుక్రవారం వెల్లడించారు. హత్యగా భావిస్తున్న ఈ కేసులో నిందితులైన ఫోగట్ సహోద్యోగులు ఇద్దరు ఆమెకు నార్త్ గోవాలోని ఓ రెస్టారెంట్లో జరిగిన పార్టీలో పానీయంలో డ్రగ్స్ కలిపి బలవంతంగా తాగించారని పేర్కొన్నారు.
నిందితులిద్దరూ పానీయంలో ఓ రసాయన పదార్థాన్ని కలిపి బలవంతంగా తాగించడం సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించిందని, ఇదే విషయాన్ని నిందితులు సుధిర్ సగ్వాన్, సుఖ్విందర్ సింగ్ విచారణలో ఒప్పకున్నారని కూడా ఐజీపీ ఓంవీర్ సింగ్ బిష్ణోయ్ తెలిపారు.
ఫోగట్ స్పృహ కోల్పోయిన అనంతరం ఆమెను రెస్టారెంట్‌లోని ఓ వాష్‌రూమ్‌కు తీసుకెళ్లి, అక్కడే రెండు గంటల పాటు ఉన్నారని, అయితే అక్కడ ఏం జరిగిందనే దానిపై నిందితులు నోరు విప్పలేదని చెప్పారు. పానీయంలో కలిపిన రసాయన పదార్థం వలనే ఫోగట్ మరణించినట్టు అనిపిస్తున్నదని, ఆర్థిక పరమైన విషయాలే ఇందుకు కారణమై ఉండొచ్చని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BJP leader
- drugs
- murder
- North Goa
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

