ముంబై: మహారాష్ట్ర(Maharashtra) జలవనరుల శాఖ మంత్రి గిరీశ్ మహాజన్‌కు అనూహ్య పరిస్థితి ఎదురైంది. ఆయనపై ఓ మహిళ గట్టిగా అరిచింది. ఈ ఘటన ఓర్లీ ప్రాంతంలో జరిగింది. లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన నేపథ్యంలో మంగళవారం బీజేపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. ఓర్లీలోని జంబోరి మైదాన్ నుంచి సాయంత్రం ర్యాలీ మొదలైంది. అయితే ఆ సమయంలో అక్కడ తీవ్ర ట్రాఫిక్ జామైంది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విపక్షం మహా వికాస్ అగాధికి వ్యతిరేకంగా బీజేపీ ఆ ర్యాలీ నిర్వహించింది. అయితే ర్యాలీ ఆలస్యం కావడంతో.. ఓర్లీ ప్రాంతం అంతా జామైంది.
ఆ ట్రాఫిక్‌లో చిక్కుకున్న మహిళ తన వాహనాన్ని వదిలేసి మంత్రి వద్దకు వెళ్లి వాగ్వాదానికి దిగింది. ఇక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ అరిచింది. మీ వల్ల ట్రాఫిక్ జామైందని ఆగ్రహం వ్యక్తం చేసింది. స్కూల్‌కు వెళ్లి తన పిల్లోడిని తీసుకువచ్చే క్రమంలో ఆమె ఆ రూట్లో వెళ్తోంది. అయితే ఎంతకీ ట్రాఫిక్ తగ్గకపోవడంతో ఆమె ఆవేశానికి గురైంది. నేరుగా ర్యాలీ నిర్వహిస్తున్న మంత్రి వద్దకు వెళ్లి గట్టిగా అరిచింది. వందల మంది వెయిటింగ్లో ఉన్నారని, ఖాళీ మైదానంలో ర్యాలీ పెట్టుకోండి అని అన్నది.
అక్కడ ఉన్న పోలీసులు ఆమెకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆ సమయంలో ఆగ్రహంతో ఉన్న ఆమె వారిపై కూడా కోపాన్ని వ్యక్తం చేసింది.
सामान्य जनतेला वेठीस धरणाऱ्या व्हीआयपी कल्चरचा जनतेला आता कंटाळा आला आहे. लोकांचा संयम ढळू लागला आहे, त्यातूनच मुंबईतील एका महिलेने मंत्री गिरीश महाजन यांची त्यांच्यामुळे झालेल्या वाहतुक कोंडीवरून खरडपट्टी काढली. pic.twitter.com/uomMBSUlGk
— Prashant Dhumal (@prash_dhumal) April 21, 2026