Air India | న్యూఢిల్లీ: ముంబై నుంచి బ్యాంకాక్ బయలుదేరాల్సిన ఎయిరిండియా విమానం రెక్కల మధ్యలో ఓ పక్షి గూడు కట్టుకోవడాన్ని ఓ ప్రయాణికుడు గుర్తించాడు.
ఈ విషయాన్ని ఎయిర్హోస్టెస్కు చెప్పడంతో సిబ్బంది వెంటనే వచ్చి పక్షిగూడును తొలగించారు. విమానం మూడు గంటలు ఆలస్యంగా బయలుదేరింది. ఇదంతా వీడియో తీసిన మరో ప్రయాణికుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో వైరల్ అయ్యింది.