Mumbai Rains | అష్ట దిగ్బంధనంలో ముంబై.. వరుసగా మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలు..!
Mumbai Rains | మూడు రోజుల నుంచి కురుస్తున్న ఎడతెగని వర్షాలతో ముంబై (Mumbai City) అష్ట దిగ్బంధనమైంది. మూడువైపులా నీరుండే నగరం నాలుగోవైపు సంబంధాలు తెగిపోవడంతో ద్వీపంలా మారింది. ముంబై-పుణె (Mumbai-Pune), ముంబై-అహ్మదాబాద్ (Mumabai-Amedabad), ముంబై-కొంకణ్ (Mumbai-Konkan) రహదారులు పూర్తిగా మూసుకుపోయాయి.
Mumbai Rains : మూడు రోజుల నుంచి కురుస్తున్న ఎడతెగని వర్షాలతో ముంబై (Mumbai City) అష్ట దిగ్బంధనమైంది. మూడువైపులా నీరుండే నగరం నాలుగోవైపు సంబంధాలు తెగిపోవడంతో ద్వీపంలా మారింది. ముంబై-పుణె (Mumbai-Pune), ముంబై-అహ్మదాబాద్ (Mumabai-Amedabad), ముంబై-కొంకణ్ (Mumbai-Konkan) రహదారులు పూర్తిగా మూసుకుపోయాయి. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్ వే (Mumbai-Pune Express way) పై సోమవారం కొండచరియలు విరగపడ్డాయి. దాంతో ఆ మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది.
ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్ వేలో ట్రాఫిక్ అంతరాయాలను తొలగించేందుకు ‘మిస్సింగ్ లింక్’ పేరుతో 13.3 కిలోమీటర్ల బైపాస్‌ను రూ.6,695 కోట్లతో నిర్మించారు. ఇందులో రెండు సొరంగాలు (1.6 కి.మీ., 8.9 కి.మీ.) ఉన్నాయి. ఈ సొరంగ మార్గాన్ని 9 వారాల కిందట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రారంభించారు. సోమవారం 3.30 గంటల సమయంలో సొరంగం సమీపంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. విపత్తు నిర్వహణ సిబ్బంది ఏకంగా 18 గంటల పాటు శ్రమించి ఈ మార్గాన్ని పునరుద్ధరించారు. రుతుపవనాల ప్రభావంతో సోమవారం పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heart Attack | మహిళల్లో పెరుగుతున్న గుండె పోటు ముప్పు.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..
TCS: గ్రీన్ కార్డు చర్యలు ప్రభావం చూపవు.. 15వేల మందిని రిక్రూట్ చేసుకుంటాం: టీసీఎస్
Nana Patekar | నానా పటేకర్ అంత్యక్రియలు అర్ధరాత్రి ఎందుకు నిర్వహించారంటే.. కుమారుడు వివరణ!
KU exams | రేపటి కేయూ పరీక్షలు వాయిదా
Shruti Haasan | బ్లాక్ లుక్‌లో శ్రుతిహాసన్.. గ్లామర్‌తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న బ్యూటీ!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

