Diamonds Smuggling: టీ పొడి ప్యాకెట్లలో వజ్రాలు స్మగ్లింగ్.. పట్టుకున్న కస్టమ్స్ అధికారులు
Diamonds Smuggling: టీ పొడి ప్యాకెట్లలో వజ్రాలు స్మగ్లింగ్ చేస్తున్న ముంబై వ్యక్తిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. సుమారు కోటిన్నర విలువైన వజ్రాలను అతను స్మగ్లింగ్ చేస్తున్నాడు. దుబాయ్‌కు వెళ్తున్న 30 ఏళ్ల ముకిమ్ రాజా అష్రఫ్ మన్సూరీని అదుపులోకి తీసుకున్నారు.
ముంబై: వజ్రాలు స్మగ్లింగ్(Diamonds Smuggling) చేస్తున్న ఓ వ్యక్తిని ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుకున్నారు. కస్టమ్స్ శాఖ అధికారులు ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. సుమారు కోటిన్నర విలువైన వజ్రాలను అతను స్మగ్లింగ్ చేస్తున్నాడు. టీ పొడి ప్యాకెట్లలో ఆ వజ్రాలను పెట్టినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. దుబాయ్‌కు వెళ్తున్న 30 ఏళ్ల ముకిమ్ రాజా అష్రఫ్ మన్సూరీని అదుపులోకి తీసుకున్నారు. దక్షిణ ముంబైలోని నుల్ బజార్‌కు చెందిన అతన్ని ఛత్రపతి శివాజీ విమానాశ్రయంలోని ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ పట్టుకున్నది. ఓ ప్రఖ్యాత టీ కంపెనీకి చెందిన ప్యాకెట్ అనుమానాస్పదంగా కనిపించిందని, దాన్ని ఓపెన్ చేసి చూడగా దాంట్లో 34 వజ్రాలు ఉన్నట్లు గుర్తించారు. 1,559.68 క్యారెట్ల ఆ వజ్రాలు మార్కెట్ లో 1.49 కోట్లకు అమ్ముడుపోనున్నాయి. ఆ వజ్రాలను స్మగ్లింగ్ చేస్తే 5 వేలు ఇస్తామన్నారని కస్టమ్స్ విచారణలో మన్సూరీ తెలిపాడు.
Mumbai Air Customs on 9th August seized 1559.6 carat natural and lab grown diamonds worth Rs 1.49 Cr from a person travelling to Dubai, which were ingeniously concealed inside a tea packet. The passenger arrested and remanded to Judicial custody: Customs pic.twitter.com/OmebdFcN99
— ANI (@ANI) August 12, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

