ముంబై: దేశంలో వాయుకాలుష్యం అత్యధికంగా ఉన్న నగరాల్లో ముంబై తొలిస్థానంలో నిలిచింది. అత్యంత కాలుష్య నగరంగా ఉన్న ఢిల్లీని దాటి తొలిస్థానంలో నిలవడం గమనార్హం. ఈ ఏడాది జనవరి 29 నుంచి ఫిబ్రవరి 8 వరకు భారత్లో వివిధ నగరాల్లో నమోదైన వాయుకాలుష్యాన్ని అంచనా వేయగా ముంబై తొలిస్థానంలో ఉన్నదని స్విస్ ఎయిర్ ట్రాకింగ్ ఇండెక్స్ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా చూసినైట్లెతే ముంబై రెండోస్థానంలో ఉన్నదని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా టాప్-10 నగరాల్లో ఢిల్లీ లేదని పేర్కొంది. తొలిస్థానంలో పాకిస్థాన్లోని లాహోర్ నిలిచిందని వివరించింది.