ముంబై: ఒకవైపు నైరుతి రుతుపవనాల ప్రభావంతో ముంబై నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. మరోవైపు ఈ ఉదయం నుంచి అరేబియా సముద్రం అల్లకల్లోలంగా మారింది. మెరైన్ డ్రైవ్ వెంబడి సముద్ర తీరంలో అలలు ఉవ్వెత్తున్న ఎగిసిపడుతున్నాయి. దాదాపు మూడు నుంచి ఐదు మీటర్ల ఎత్తుతో అలలు తీరాన్ని తాకుతున్నాయి. ఈ అలలకు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా వీక్షించవచ్చు.
ఇదిలావుంటే.. ముంబైలో ఇవాళ కూడా రోజంతా వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నదని వారు వెల్లడించారు.
Mumbai | High tide hits Marine Drive amid rainfall
— ANI (@ANI) July 22, 2021
City and suburbs may witness moderate to heavy rainfall/thundershowers with possibility of very heavy rainfall at isolated places: India Meteorological Department (IMD) pic.twitter.com/19LCjak591