ముంబై, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ) : తన ఆర్థిక పరిస్థితిని దాచిపెట్టి, భార్యతో విడాకులు తీసుకున్న భర్తకు ముంబై హైకోర్టు షాక్ ఇచ్చింది. కోర్టును తప్పుదారి పట్టించినందుకు భరణం మొత్తాన్ని 7 రెట్లు పెంచుతూ తీర్పు చెప్పింది. ఫలితంగా నిందితుడు,తన మాజీ భార్యకు చెల్లించాల్సిన భరణం మొత్తం నెలకు రూ.50 వేల నుంచి 3.5 లక్షలకు పెరిగింది.
రూ.1000 కోట్ల ఆర్థిక సామ్రాజ్యం ఉన్నప్పటికీ, నెలకు కేవలం రూ.6 లక్షలు మాత్రమే ఆదాయం ఉందని కోర్టుకు చెప్పిన భర్త తన భార్యతో విడాకులు తీసుకున్నాడు. దీంతో భరణం పెంచడంతో పాటు 42 లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు తీర్పు చెప్పింది.