Drugs suppliers : నిషేధిత డ్రగ్స్‌ను సప్లయ్ చేస్తున్న నలుగురు వ్యక్తులను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబై క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన యాంటీ నార్కొటిక్స్ సెల్‌లోని కండివాలీ విభాగం పోలీసులు మలాద్, మాల్వానీ ఏరియాల నుంచి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి అంతర్జాతీయ మార్కెట్లో రూ.2.36 కోట్ల విలువ చేసే 594 గ్రాముల హెరాయిన్ డ్రగ్స్‌ను సీజ్ చేశారు.
అరెస్టయిన నలుగురు డ్రగ్స్ సప్లయర్స్ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. అయితే వాళ్లు ముంబైలో ఎవరికి ఆ డ్రగ్స్‌ను సప్లయ్ చేస్తున్నారనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నది. ఆ మేరకు పోలీసులు నిందితులను ఇంటరాగేట్ చేస్తున్నారు. కాగా గత 10 నెలల్లో ముంబై క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన నార్కోటిక్ సెల్ పోలీసులు డ్రగ్స్ సప్లయ్ చేస్తున్న 146 మందిని అరెస్ట్ చేశారు.
డ్రగ్స్ సరఫరాకు సంబంధించి మొత్తం 68 కేసులు నమోదు చేశారు. మొత్తం రూ.55 కోట్ల విలువ చేసే 3,010 కిలోల డ్రగ్స్‌ను సీజ్ చేశారు. ఈ విషయాన్ని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు శనివారం సాయంత్రం వెల్లడించారు.