Mumbai Court | బ్రేకప్ తర్వాత ప్రియుడి ఆత్మహత్యకు లవర్ను తప్పుబట్టలేం: ముంబై కోర్టు
ప్రియునికి ప్రియురాలు బ్రేకప్ చెప్పిన తర్వాత, మానసిక ఆవేదనతో ఆ ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడితే, ఆ ప్రియురాలు అతనిని ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు పరిగణించలేమని ముంబై కోర్టు చెప్పింది.
Mumbai Court | ముంబై: ప్రియునికి ప్రియురాలు బ్రేకప్ చెప్పిన తర్వాత, మానసిక ఆవేదనతో ఆ ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడితే, ఆ ప్రియురాలు అతనిని ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు పరిగణించలేమని ముంబై కోర్టు చెప్పింది. అయితే ఇష్టానుసారం ప్రేమికులను మార్చడం నైతికంగా సరికాదని తెలిపింది. ఆమె తిరస్కరణను ఎదుర్కొన్న బాధితునికి చట్టపరమైన ఉపశమనం ఏదీ లేదని వివరించింది. కేసు వివరాలు ఏమిటంటే, నితిన్ కేనీ, మనీషా చుడసమ ప్రేమించుకున్నారు.
కొన్నాళ్ల తర్వాత నితిన్కు మనీషా బ్రేకప్ చెప్పింది. ఆ తర్వాత ఆమెకు రాజేశ్ పన్వర్తో నిశ్చితార్థం జరిగింది. దీంతో 2016 జనవరి 15న నితిన్ తన ఇంట్లో ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నారు. మనీషా బ్రేకప్ చెప్పడంతో నితిన్ మానసికంగా కుంగిపోయినట్టు కనిపిస్తున్నదని అదనపు సెషన్స్ జడ్జి ఎన్పీ మెహతా వ్యాఖ్యానించారు. ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కేసు వెల్లడి కావాలంటే, బాధితుడిని అందుకు పురిగొలిపినట్లు లేదా సలహా ఇచ్చినట్లు స్పష్టమవ్వాలని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- break up
- love
- Mumbai Court
- Suicide
RELATED ARTICLES
తాజా వార్తలు
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

