న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ)ను మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడు, పరారీలో ఉన్న మెహుల్ చోక్సీకి చెందిన 13 ఆస్తులను వేలం వేసేందుకు గీతాంజలి జెమ్స్ లిమిటెడ్ కంపెనీకి ముంబైలోని ప్రత్యేక కోర్టు అనుమతించింది. వేలం ద్వారా వచ్చిన సొమ్మును ప్రత్యేక కోర్టు పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని కూడా కోర్టు ఆదేశించింది.
చోక్సీకి చెందిన ఆస్తులలో అపార్ట్మెంట్ ఫ్లాట్లు, విలువైన రత్నాలు ఉన్నాయి. వీటి మొత్తం విలువ సుమారు రూ.46 కోట్ల వరకు ఉంటుంది.