ముంబై: మరాఠీ మాట్లాడలేదనే కారణంతో ఫుడ్ డెలివరీ ఏజెంట్‌ను ఓ జంట వేధించింది (Delivery Agent). స్థానిక భాష మాట్లాడితేనే డబ్బులు ఇస్తామంటూ జబర్తీ చేసిన ఘటన ముంబైలోని భండూప్ ప్రాంతంలో చోటుచేసుకున్నది. ఈ నెల 12న భండూప్ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌కు పిజ్జా డెలివరీ చేయడానికి రోహిత్ లెవ్రే అనే డెలివరీ ఏజెంట్ వచ్చాడు. అతని నుంచి ఆర్డర్ తీసుకున్న దంపతులు.. డబ్బులు ఇవ్వడానికి నిరాకరించారు.
మరాఠీలో మాట్లాడితేనే డబ్బులు చెల్లిస్తామంటూ ఆర్డర్ చేసిన కపుల్స్ షరతు పెట్టారు. ఇంటి డోర్‌కు ఉన్న గ్రిల్‌కు తాళం వేసిన దంపతులు.. లోపల నుంచి అతనితో వాదనకు దిగారు. దీనినంతటినీ అతడు తన సెల్ఫోన్లో బంధించాడు. ‘ఆర్డర్ తీసుకుంటాం. కానీ మీరు మరాఠీలో మాట్లాడితేనే డబ్బులు చెల్లిస్తాం’ అంటూ ఆ మహిళ అనడం వీడియోలో వినవచ్చు. దీనికి, ‘మరాఠీ మాట్లాడాలని రూల్ ఏమీ లేదుగా, అలా అని ఎవరు చెప్పారంటూ’ రోహిత్ వారిని ప్రశ్నించాడు. ఇక్కడ ఇలాగే ఉంటుందంటూ ఆమె బదులిచ్చింది. ప్రతిగా మీ డిమాండ్ వెనుక ఉన్న లాజిక్ ఏంటని అతడు ప్రశ్నించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డెలివరీ ఏజెంట్‌ను వేధించిన ఆ దంపతులపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
A Domino’s delivery boy Rohit Levre was denied payment by a couple in Mumbai because he couldn’t speak Marathi.
Pick on someone powerless, create an issue out of nothing, and harass them just to feel important, the trademark behaviour of petty, bigoted, arrogant, and ego-driven… pic.twitter.com/ZKcXHVmDcy
— THE SKIN DOCTOR (@theskindoctor13) May 13, 2025