Mumbai Rains | ముంబైని ముంచెత్తిన వాన : రెడ్ అలర్ట్ జారీ
Mumbai Rains : మహారాష్ట్రలో అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (IMD) హెచ్చరించడతో అధికారులు అప్రమత్తమయ్యారు.
Mumbai Rains : మహారాష్ట్రలో అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (IMD) హెచ్చరించడతో అధికారులు అప్రమత్తమయ్యారు. జులై 26, 27న మధ్య మహారాష్ట్ర, కొంకణ్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ముంబై, పుణేల్లో గత కొద్దిరోజులుగా భారీ వర్షపాతం నమోదవగా ఈ నగరాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో నగరవాసులు బిక్కుబిక్కుమంటున్నారు.
ముంబై, పుణే నగరాలను భారీ వర్షాలు ముంచెత్తనున్నాయని ఐఎండీ పేర్కొంది. అయితే ఈ రెండు రోజులు ముంబైలో స్కూళ్లు, విద్యాసంస్ధలకు సెలవు ప్రకటించాలని అధికారులు యోచిస్తున్నారు. ప్రజలు ఇండ్లకే పరిమితం కావాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని పోలీసులు, బీఎంసీ (BMC) అధికారులు కోరుతున్నారు. భారీ వర్షాల నేపధ్యంలో మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ఇటీవల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఉన్నతస్ధాయి సమావేశంలో వరద సహాయ చర్యలు, పునరావాస కార్యక్రమాలపై డిప్యూటీ సీఎంలు అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్‌లతో కలిసి సమీక్షించారు. పుణే ప్రాంతంలో భారీ వర్షాలతో వరద పోటెత్తిందని అక్కడ సహాయ, పునరావాస కార్యక్రమాలను తాను పర్యవేక్షిస్తున్నానని సీఎం వెల్లడించారు. ముంబైలో ఎలాంటి పరిస్ధితి ఎదురైనా అధిగమించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమైందని, తాను ముంబై, పుణే, రాయ్‌గఢ్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో తాను సంప్రదింపులు జరుపుతున్నానని సీఎం తెలిపారు.
Read More :
Skanda | యూట్యూబ్‌లో రామ్-బోయపాటి సునామి.. స్కందకు రికార్డు రెస్పాన్స్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పాతికేండ్లయినా ప్రమోషన్ నిల్.. అత్యంత దయనీయ స్థితిలో ఎస్జీటీలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

