ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో మూడు నెలల కిందట ప్రారంభించిన అటల్ సేతు (Atal Setu) సముద్ర వంతెన నిర్మాణంలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. నాణ్యత లోపించడంతో రహదారిపై పగుళ్లు ఏర్పడ్డాయని ఆ పార్టీ విమర్శించింది. మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే శుక్రవారం అటల్ సేతు వంతెనను సందర్శించారు. రోడ్డుపై ఏర్పడిన పగుళ్లను ఆయన పరిశీలించారు. అర కిలోమీటరు దూరం వరకు అడుగు లోతు మేర రోడ్డు పగుళ్లిచ్చిందని విమర్శించారు. రూ.18,000 కోట్ల వ్యయంతో చేపట్టిన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ (ఎంటీహెచ్ఎల్)గా పిలిచే అటల్ సేతు సముద్ర వంతెన నిర్మాణంలో అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు.
కాగా, దక్షిణ ముంబై, నవీ ముంబైని కలిపే ఈ ప్రాజెక్ట్ నోడల్ ఏజెన్సీ అయిన ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎంఎంఆర్డీఏ) ఈ ఆరోపణలను ఖండించింది. అటల్ సేతు బ్రిడ్జిపై పగుళ్లు ఏర్పడలేదని తెలిపింది. నవీ ముంబైలోని ఉల్వే నుంచి వచ్చే అప్రోచ్ రోడ్డుపైనే పగుళ్లు ఉన్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎదురుదాడికి దిగింది. అటల్ సేతును కించపరడం ఆపాలని కాంగ్రెస్కు సూచించింది.
#WATCH | Mumbai: Maharashtra Congress President Nana Patole inspected the cracks seen on the Mumbai-trans Harbour Link (MTHL) Atal Setu. pic.twitter.com/cwZU4wiI4I
— ANI (@ANI) June 21, 2024