Mumbai Cafe | ట్రాన్స్‌జెండర్స్‌కు కూడా హక్కులుంటాయి. వాళ్లకూ ఈ దేశంలో బతికే హక్కు ఉంది. పని చేసే హక్కు ఉంది. కానీ.. ఇప్పటికీ ట్రాన్స్‌జెండర్స్‌ను కొందరు దూరం పెడుతున్నారు. అలాంటి వ్యవస్థ పోవాలి.. అనే సదుద్దేశంతో ఓ కేఫ్.. ఉద్యోగులుగా ట్రాన్స్జెండర్స్నే నియమించుకుంది. ఆ కేఫ్ ఎక్కడుందో తెలుసా? ముంబైలోని వెర్సోవాలో. ఆ కేఫ్ పేరు బాంబాయ్ నజారియా. ఆ కేఫ్ మోటో ఏంటో తెలుసా? నజారియా బదలో.. నజారా బద్లేగా అంటే.. ముందు నువ్వు మారు.. ఆ తర్వాత ఈ ప్రపంచమే మారుతుంది అని అర్థం.
ఈ కేఫ్‌లో ట్రాన్స్‌జెండర్స్‌ను మాత్రమే ఉద్యోగంలోకి తీసుకోవడంతో వెర్సోవా ప్రాంతంలో ఈ కేఫ్ ఫేమస్ అయిపోయింది. ట్రాన్స్‌జెండర్స్‌కు ఒక దారి చూపించిన ఆ కేఫ్ ఓనర్‌కు స్థానికులు సలాం కొడుతున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ కేఫ్ గురించి చాలామంది వీడియోలు తీసి పోస్ట్ చేశారు. బాంబే ఫుడీ టేల్స్ అనే యూట్యూబ్ చానెల్లో ఇటీవల ఈ కేఫ్‌కు సంబంధించిన వీడియోను పోస్ట్ చేయడంతో ఆ వీడియో వైరల్ అవుతోంది.