16 ఏళ్ల బాలుడు.. పబ్జీ గేమ్‌కు బానిస అయ్యాడు. అంతటితో ఆగలేదు. తన తల్లి బ్యాంక్ అకౌంట్లోని 10 లక్షలు కాజేసి మరీ పబ్జీ ఆడాడు. ఈ ఘటన ముంబైలోని జోగేశ్వరిలో చోటు చేసుకుంది. పబ్జీ ఆడుతూ.. తన తల్లి అకౌంట్ నుంచి ఆన్లైన్ ట్రాన్జాక్షన్స్ ద్వారా 10 లక్షలు ఖర్చు పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు.. ఆ బాలుడిని మందలించేసరికి.. ఇంట్లో నుంచి పారిపోయాడు.
వెంటనే తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు.. అందేరి ఈస్ట్‌లోని మహాకాళీ కేవ్స్ ఏరియా ప్రాంతంలో ఆ బాలుడిని గుర్తించారు.
తల్లి అకౌంట్ నుంచి 10 లక్షలు ఖర్చు పెట్టి.. పబ్జీ ఐడీ, వర్చువల్ కరెన్సీని తీసుకొని.. పబ్జీ గేమ్ ఆడాడు. అయితే.. తన అకౌంట్లో నుంచి 10 లక్షలు డెబిట్ అయిన విషయం తెలుసుకున్న ఆ బాలుడి తల్లి.. కొడుకును నిలదీయగా అసలు విషయం చెప్పాడు. దీంతో తల్లిదండ్రులు ఇద్దరూ ఆ బాలుడిని తీవ్రంగా తిట్టడంతో.. ఇంట్లో నుంచి పారిపోయాడు. పోలీసులు తర్వాత బాలుడికి కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.