Mumbai boy | మలేరియా, డెంగ్యూ, లెప్టో బారిన పడిన బాలుడు.. ఒకేసారి మూడు రోగాలు సోకడంతో మృతి
Mumbai boy | ఒక బాలుడు (Mumbai boy) మలేరియా, డెంగ్యూ, లెప్టోస్పిరోసిస్‌తో బాధపడ్డాడు. ఈ మూడు రోగాలు ఒకేసారి సోకడంతో చికిత్స పొందుతూ మరణించాడు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది.
ముంబై: ఒక బాలుడు (Mumbai boy) మలేరియా, డెంగ్యూ, లెప్టోస్పిరోసిస్‌తో బాధపడ్డాడు. ఈ మూడు రోగాలు ఒకేసారి సోకడంతో చికిత్స పొందుతూ మరణించాడు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. కుర్లా ప్రాంతానికి చెందిన14 ఏండ్ల బాలుడికి ఆగస్ట్ మొదటి వారంలో జ్వరం వచ్చింది. అయితే డాక్టర్‌ను సంప్రదించలేదు. వారం రోజుల పాటు ట్యాబెట్లు వేసుకుని సొంతంగా చికిత్స పొందాడు. ఆరోగ్య పరిస్థితి దిగజారడంతో ఆగస్ట్ 14న కస్తూర్బా ప్రభుత్వ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. డాక్టర్లు ఆ బాలుడ్ని పరిశీలించి వైద్య పరీక్షలు చేశారు. దీంతో డెంగ్యూ, మలేరియా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మరో టెస్ట్ నిర్వహించగా లెప్టోస్పిరోసిస్ కూడా సోకినట్లు తేలింది.
కాగా, ఒకేసారి మూడు రోగాలు సోకిన ఆ బాలుడ్ని ముంబై సెంట్రల్‌లోని నాయర్ హాస్పిటల్‌కు తరలించి అడ్మిట్ చేశారు. ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య కూడా తలెత్తింది. దీంతో ఆ బాలుడికి వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. మూడు రోగాలకు డాక్టర్లు వైద్యం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. పలు అవయవాలు పనిచేయకపోవడంతో హాస్పిటల్లో అడ్మిట్ అయిన మూడు రోజుల్లోనే ఆ బాలుడు మరణించాడు.
మరోవైపు ఒక వ్యక్తికి ఒకేసారి మూడు రోగాలు సోకడం అసాధారణ విషయం కాదని సీనియర్ డాక్టర్ తెలిపారు. అయితే ఇలాంటి సంఘటన చాలా అరుదుగా జరుగుతుందని చెప్పారు. వైద్య చికిత్స కోసం డాక్టర్లను ముందుగా సంప్రదించి ఉంటే ఆ బాలుడిని కాపాడే అవకాశాలు ఉండేవని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

