న్యూఢిల్లీ : కోల్‌కతా ఎయిరపోర్ట్ నుంచి శుక్రవారం ఉదయం టేకాఫ్ అయిన ఇండిగో విమానం సాంకేతిక లోపంతో వెనుతిరిగింది. 156 మంది ప్రయాణీకులతో ముంబై బయలుదేరిన విమానం నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానం నుంచి ఉదయం 10.05 గంటలకు టేకాఫ్ అయింది.
విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో టేకాఫ్ అయిన కొద్దినిమిషాలకే వెనుతిరగనున్నట్టు పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించాడు. దీంతో విమానం కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్యను చక్కదిద్దేందుకు ఇంజనీర్లు తనిఖీ చేస్తున్నారని అధికారులు తెలిపారు.