Akasa flight | వారణాసి నుంచి ముంబై వెళ్తున్న ఓ విమానం భోపాల్ (Bhopal)లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. విమానం గాల్లో ఉండగా ఓ ప్రయాణికుడు అస్వస్థతకు (passenger falls ill) గురయ్యాడు. దీంతో విమానాన్ని పైలట్ ఎమర్జెన్సీ ల్యాండ్ (emergency landing) చేశారు.
172 మంది ప్రయాణికులతో ఆకాశా ఎయిర్ (Akasa flight)కు చెందిన విమానం గురువారం ఉదయం వారణాసి నుంచి ముంబైకి బయల్దేరింది. విమానం గాల్లో ఉండగా.. ఓ ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అప్రమత్తమైన పైలట్ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ను సంప్రదించారు. వారి అనుమతితో ఉదయం 11:40 గంటల సమయంలో భోపాల్‌లోని రాజా భోజ్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేసినట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.
విమానం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన అనంతరం సదరు ప్రయాణికుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసిన అనంతరం సాయంత్రం 5 గంటలకు విమానం తిరిగి తన ప్రయాణాన్ని కొనసాగించే అవకాశం ఉందని సదరు అధికారి వెల్లడించారు.
Also Read..
PM Modi | పారిస్ ఒలింపిక్స్ పతక విజేతలతో మోదీ భేటీ.. ప్రధానికి ప్రత్యేక బహుమతి ఇచ్చిన హాకీ జట్టు
Turban | స్వాతంత్య్ర వేడుకల వేళ.. మరోసారి ప్రత్యేక తలపాగాతో ఆకట్టుకున్న ప్రధాని మోదీ
PM Modi | ఎర్రకోట నుంచి సుదీర్ఘ ప్రసంగం.. మునుపటి రికార్డులను అధిగమించిన ప్రధాని మోదీ