Boat accident : ముంబై (Mumbai) తీరంలో ఘోర పడవ ప్రమాదం (Boat accident) జరిగింది. 60 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బోటు ప్రమాదవశాత్తు మునిగిపోయింది. సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన ఇండియన్ కోస్ట్‌గార్డ్స్ (Indian coast guards) రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. 20 మందిని రక్షించారు. ఒక మృతదేహాన్ని కూడా వెలికి తీశారు. మిగతావారు గల్లంతయ్యారు.
గల్లంతైన వారి ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ప్రమాదం నుంచి బయటపడ్డ 20 మంది ప్రస్తుతం ఇండియన్ కోస్ట్‌గార్డ్ షిప్ సుభద్ర కుమారి చౌహాన్లో ఉన్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని భారత తీర రక్షక దళం అధికారులు తెలిపారు. కాగా ఘటనపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకుని త్వరలో ప్రకటన చేస్తానని చెప్పారు.