Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయి. ముంబై నుంచి బెంగుళూరు, వారణాసి నుంచి ఢిల్లీకి వెళ్లే వందేభారత్ స్లీపర్ రైళ్లు త్వరలో ప్రారంభంకానున్నాయి. అక్టోబర్ 31, నవంబర్ 1వ తేదీన వాటిని ఆవిష్కరించనున్నారు.
న్యూఢిల్లీ: రెండు వందేభారత్ స్లీపర్ రైళ్లు(Vande Bharat Sleeper Trains) వచ్చేస్తున్నాయి. ముంబై నుంచి బెంగుళూరు, వారణాసి నుంచి ఢిల్లీకి వెళ్లే వందేభారత్ స్లీపర్ రైళ్లు త్వరలో ప్రారంభంకానున్నాయి. ముంబై-బెంగుళూరు రైలును అక్టోబర్ 31వ తేదీన, వారణాసి-న్యూఢిలీ రైలును నవంబర్ 1వ తేదీన ఆవిష్కరించనున్నారు. అదనపు వేగంతో రాత్రిపూట ఆ రైళ్లు ప్రయాణికులను గమ్యస్థానం చేర్చనున్నాయి. ముంబై – బెంగుళూరు రైలు సుమారు 1000 కిలోమీటర్ల ప్రయాణాన్ని 15 గంటల 45 నిమిషాల్లో చేరనున్నది. ఇక వారణాసి-ఢిల్లీ రైలు ప్రయాగ్‌రాజ్, కాన్పూర్ మీదుగా ప్రయాణిస్తుంది. ప్రస్తుతం హౌరా-కామాఖ్య మధ్య వందేభారత్ స్లీపర్ రైలు ఉన్న విషయం తెలిసిందే.
కొత్తగా ప్రారంభంకానున్న రెండు రైళ్లు వారానికి ఆరు రోజులు నడిచే అవకాశాలు ఉన్నాయి. ముంబై-బెంగుళూరు రైలు సీఎస్ఎంటీ స్టేషన్ నుంచి రాత్రి 8.10 నిమిషాలకు కదులుతుంది. తెల్లవారుజామున ఉదయం 11.55 నిమిషాలకు ఎస్ఎంవీటీ బెంగుళూరు చేరుకుంటుంది. ఇక రిటర్న్ జర్నీలో బెంగుళూరు నుంచి రాత్రి 7.50 నిమిషాలకు బయలుదేరి సీఎస్ఎంటీ 11.55 నిమిషాలకు చేరుకుంటుంది. ఈ రైలు వల్ల సుమారు 6 గంటల 20 నిమిషాల పాటు ప్రయాణ సమయం తగ్గనున్నది.
వారణాసి-ఢిల్లీ రైలు వారణాసిలో రాత్రి 8.50 నిమిషాలకు స్టార్ట్ అయి, తెల్లవారుజామున 5.55 నిమిషాలకు ఢిల్లీ చేరుకుంటుంది. రిటర్న్ జర్నీలో ఢిల్లీ నుంచి రాత్రి 9.40 నిమిషాలకు మొదలై,వారణాసికి ఉదయం 6.45కు చేరుకుంటుంది.
📍Varanasi–Delhi Vande Bharat Sleeper:
A BIG Diwali gift for Kashi! https://t.co/Lniaim9u0j
— Himanshu Jain (@HemanNamo) October 24, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
ఉద్యమకారుల ముందస్తు అరెస్టు
‘ఈ 31న జరిగే టీపీఎఫ్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి’
Rashmika | విజయ్ను 100 కాదు.. 1000 సార్లు ప్రపోజ్ చేస్తా.. ట్రోలర్లకు రష్మిక గట్టి సమాధానం!
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

