ముంబై ఎయిర్‌పోర్ట్‌లో 15 కిలోల బంగారం పట్టివేత
15 kg gold seized | మహారాష్ట్రలోని ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు 24 గంటల్లో వేర్వేరు కేసుల్లో రూ.7.87కోట్ల విలువైన 15 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే రూ.22లక్షల విలువైన విదేశీ
ముంబై : మహారాష్ట్రలోని ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు 24 గంటల్లో వేర్వేరు కేసుల్లో రూ.7.87కోట్ల విలువైన 15 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే రూ.22లక్షల విలువైన విదేశీ కరెన్సీని పట్టుకున్నారు. ఈ నెల 11-12 మధ్య ఆయా కేసుల్లో ప్రమేయం ఉన్న ఏడుగురు ప్రయాణికులను అరెస్టు చేశారు. పక్కా సమాచారం మేరకు.. దుబాయి నుంచి వచ్చిన ఓ వ్యక్తి నుంచి 9.895 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తి ఛాతిభాగంలో ప్రత్యేకంగా బెల్టులా ధరించినట్లు పేర్కొన్నారు. దుబాయిలో ఇద్దరు సూడాన్ ట్రావెలర్లు తనకు తనకు ఈ బంగారాన్ని ఇచ్చారని సదరు వ్యక్తి అధికారుల విచారణలో తెలిపాడు.
సూడాన్ ట్రావెర్లతో పాటు సదరు వ్యక్తిని 14 రోజు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. మరో కేసులో రూ.99.75లక్షల విలువైన 1.875 కిలోల బంగారం పొడిన కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లోదుస్తుల్లో దాచి అక్రమంగా తరలిస్తుండగా ఇద్దరు వ్యక్తుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. దుబాయి నుంచి వచ్చిన మరో సూడాన్ జాతీయుడి నుంచి రూ.51.17లక్షల విలువైన 973 బంగారం పొడిని స్వాధీనం చేసుకున్నారు. పురీషనాళంలో దాచి తరలించేందుకు యత్నించగా పట్టుకొని, అరెస్టు చేశారు. మరో వైపు దుబాయి వెళ్లే విమానంలో భారతీయ ప్రయాణికుడి నుంచి 50వేల దిర్హామ్‌లను (రూ.11.20లక్షలు) తరలిస్తుండగా పట్టుకున్నారు. మరో వ్యక్తి నుంచి 45వేల దిర్హామ్స్ (రూ.10.08లక్షలు)ను స్వాధీనం చేసుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | కేసీఆర్ నాయకత్వంలో వచ్చేది ప్రజా ప్రభుత్వం.. సిద్దిపేట గడ్డ నుంచే మరోసారి ఉద్యమ శంఖారావం: హరీశ్‌రావు
Horoscope | 12-10-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
కొత్త జిల్లాలు.. అభివృద్ధి ఖిల్లాలు
కాలిన మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లతో ఆందోళన
రాష్ట్రంలో విద్యుత్తు సంక్షోభం.. కాంగ్రెస్ వచ్చింది ఉయ్యాలో.. కరెంటు పోయింది ఉయ్యాలో..
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

