Mukul Wasnik : ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో దేశ ప్రజలు నరేంద్ర మోదీ నాయకత్వాన్ని విస్పష్టంగా తిరస్కరించారని కాంగ్రెస్ పేర్కొంది. బీజేపీకి వ్యతిరేకంగా వచ్చిన ఈ ఫలితాలు ప్రధాని మోదీ వ్యక్తిగత వైఫల్యంగా తాను పరిగణిస్తానని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ అన్నారు.
ముకుల్ వాస్నిక్ గురువారం అహ్మదాబాద్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. లోక్సభ ఎన్నికల్లో మోదీకి నైతిక ఓటమి ఎదురైందని పేర్కొన్నారు. భారత ప్రజలు మోదీ నాయకత్వాన్ని తిరస్కరించారని, ప్రజలు తాము ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యలు, అంశాల వారీగా మోదీ సర్కార్కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యానించారు.
Read More :
Hypertension | వ్యాయామం రెట్టింపు చేస్తే హై బీపీ రాదు!