Hypertension | వ్యాయామం రెట్టింపు చేస్తే హై బీపీ రాదు!
హై బీపీ నివారణపై ప్రస్తుత మార్గదర్శకాలను మార్చాలని ఓ అధ్యయనం అభిప్రాయపడింది. పెద్దల శారీరక శ్రమలో కనీస ప్రమాణాల్ని రెట్టింపు చేయాలని, తద్వారా హై బీపీని నివారించవచ్చునని పరిశోధకులు తెలిపారు.
Hypertension | న్యూఢిల్లీ, జూన్ 12: హై బీపీ నివారణపై ప్రస్తుత మార్గదర్శకాలను మార్చాలని ఓ అధ్యయనం అభిప్రాయపడింది. పెద్దల శారీరక శ్రమలో కనీస ప్రమాణాల్ని రెట్టింపు చేయాలని, తద్వారా హై బీపీని నివారించవచ్చునని పరిశోధకులు తెలిపారు. ఈ మేరకు 5 వేల మందిపై యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన పరిశోధకులు చేసిన అధ్యయనాన్ని ‘అమెరికన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్’ ప్రచురించింది.
హై బీపీ సమస్య పెరగడానికి కారణం..18 నుంచి 40 ఏండ్ల వాళ్లలో వ్యాయామం చేసేవాళ్లు గణనీయంగా తగ్గడమేనని నివేదిక తెలిపింది. వైద్య నిపుణుడు జాసన్ నాగట మాట్లాడుతూ, ‘యుక్త వయస్సులో ఉన్న సగం మందిలో శారీరక శ్రమ సాధారణ స్థాయి కన్నా తక్కువగా ఉంది. దీనికి, రక్తపోటు ఆరంభానికి సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో శారీరక శ్రమ కనీస ప్రమాణాన్ని పెంచాల్సిన అవసరముంది. దీనిని రెట్టింపు చేయటం ద్వారా హై బీపీని నివారించవచ్చు’ అని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

