ముంబై: సహకార బ్యాంకుల స్కామ్లో ఈడీ సమర్పించిన ఛార్జ్షీట్లో ఎన్సీపీ నేత అజిత్ పవార్, ఆయన భార్య పేర్లు లేకపోవటం రాజకీయంగా చర్చనీయాంశమైంది. దీనిపై ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ, ‘ఈడీ, సీబీఐల దుర్వినియోగానికి ఈ కేసు ఒక ఉదాహరణ. ఎన్నో రోజులపాటు శరద్ పవార్ కుటుంబాన్ని కేంద్రం వేధించింది.
వారి ఇండ్లపై దాడులు చేసింది. ఆధారాలేవీ దొరక్క సహకార బ్యాంక్ కుంభకోణం కేసు చార్జిషీట్లో వారి పేర్లు చేర్చలేదు’ అని ఆయన తెలిపారు.