అమిత్షా వ్యాఖ్యలను తిప్పికొట్టిన సంజయ్రౌత్
Sanjay Raut | ముఖ్యమంత్రి పదవి కోసం హిందుత్వాన్ని వదులుకున్నారంటూ ఉద్ధవ్ ఠాక్రేపై కేంద్రహోంశాఖ మంత్రి అమిత్షా

ఢిల్లీ : ముఖ్యమంత్రి పదవి కోసం హిందుత్వాన్ని వదులుకున్నారంటూ ఉద్ధవ్ ఠాక్రేపై కేంద్రహోంశాఖ మంత్రి అమిత్షా చేసిన వ్యాఖ్యలను శివసేన నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ తిప్పికొట్టారు. పుణేలో ఆదివారం పర్యటించిన అమిత్ షా సీఎం పదవి కోసం రాజీపడి హిందుత్వాన్ని వదులుకున్నారని సీఎం ఉద్ధవ్ ఠాకేతో పాటు శివసేపై విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలపై సోమవారం సంజయ్ రౌత్ ఢిల్లీలో స్పందించారు. అధికారంలో ఎక్కువ వాటా కోసం 2014లో శివసేనకు బీజేపీ ద్రోహం చేసిందని ఆరోపించారు. తమ పార్టీ హిందుత్వాన్ని ఎప్పుడూ వదులుకోదని స్పష్టం చేశారు.
2019 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్, తాను, ప్రధాని నరేంద్ర మోదీలు స్పష్టం చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వాదన వాస్తవాలకు దూరంగా ఉందన్నారు. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీఎం పదవిని పంచుకోవడంపై రెండు పార్టీల మధ్య విభేదాలు తలెత్తడంతో ఉద్ధవ్ ఠాకే బీజేపీ నేతృత్వంలోని కూటమి నుంచి బయటకు వచ్చింది. ఆ తర్వాత కాంగ్రెస్, ఎన్సీపీతో చేతులు కలిపిన మహా వికాస్ అఘాడి (MVA) పేరిట సంకీర్ణ ప్రభుత్వాన్ని శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. ఠాక్రే సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

