Vinesh Phogat : పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. రెజ్లింగ్ ఫైనల్‌కు (Indian wrestler) చేరిన భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ (Vinesh Phogat) పతకం ఆశలు ఆవిరయ్యాయి. అధిక బరువు కారణంగా ఆమెపై అనర్హత వేటు పడింది. నంబర్ వన్ రెజ్లర్ సుసాకిపై విజయం సాధించి ఫైనల్‌కు చేరిన ఫొగాట్‌పై అనర్హత వేటు పడటం సర్వత్రా షాక్‌కు గురి చేస్తోంది.
వినేష్ ఫొగాట్‌పై అనర్హత వేటు దేశానికి నష్టమని బీజేపీ ఎంపీ కరణ్ భూషణ్ సింగ్ అభివర్ణించారు. ఫెడరేషన్ ఈ విషయం పరిశీలించి ఏం చేయాలో నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఇక వినేష్ ఫొగాట్‌పై అనర్హత విచారకరమని ప్రధాని నరేంద్ర మోదీ అంతకుముందు ట్వీట్ చేశారు. వినేష్ మీరు ఛాంపియన్లకే ఛాంపియన్, భాతర్‌కు గర్వకారణం, ప్రతి ఒక్క భారతీయుడికి స్ఫూర్తిదాయకమని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
సవాళ్లకు దీటుగా మీరు మరింత గట్టిగా ముందుకొస్తారని తమకు తెలుసని పేర్కొన్నారు. మరోవైపు ఫొగాట్‌పై అనర్హత అంశంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు వార్త నిజం కాకుంటే బాగుండు అంటూ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ‘నోనోనో.. ఇది ఓ పీడకల అయితే బాగుండు..’ అంటూ ట్వీట్లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
Read More :