Samantha | సౌతిండియా రికార్డ్.. సమంత పారితోషికం తెలిస్తే షాకే.. !
Samantha | టాలీవుడ్ క్రేజీ కథానాయికల్లో సమంత (Samantha) ఒకరు. టాలీవుడ్లో స్టార్ హీరోలందరితోనూ సమంత నటించింది. నాగచైతన్యతో ప్రేమ వివాహం తరువాత కూడా సినిమాల్లో ఈ అమ్మడు ఏ మాత్రం జోరు తగ్గించలేదు. అయితే నాగచైతన్య, సమంతల మధ్య వచ్చిన మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే విడాకుల తరువాత కూడా సమంత చాలా సినిమాల్లో నటించింది.
Samantha | టాలీవుడ్ క్రేజీ కథానాయికల్లో సమంత (Samantha) ఒకరు. తొలిచిత్రం నాగచైతన్యతో నటించిన ఏ మాయ చేసావేతో కుర్రకారు హృదయాలను గిలిగింతలు పెట్టిన ఈ భామ అతి తక్కువ కాలంలోనే తెలుగులో అగ్రనాయికగా ఎదిగింది. టాలీవుడ్లో స్టార్ హీరోలందరితోనూ సమంత నటించింది. నాగచైతన్యతో ప్రేమ వివాహం తరువాత కూడా సినిమాల్లో ఈ అమ్మడు ఏ మాత్రం జోరు తగ్గించలేదు. అయితే నాగచైతన్య, సమంతల మధ్య వచ్చిన మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే విడాకుల తరువాత కూడా సమంత చాలా సినిమాల్లో నటించింది.
అంతేకాదు పుష్ప చిత్రంలో ఊ.. అంటావా.. మామ. ఊ..ఉ అంటావా మామ అంటూ ఐటెమ్ సాంగ్ చేసి అందరికి షాక్ ఇచ్చింది. కాగా ఈ మధ్యలోనే మయోసైటిస్ అనే వ్యాదితో ఆమె ఆరోగ్యం దెబ్బతింది. దాంతో కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా వుండి.. యోగా, మెడిటేషన్, మెడిసిన్స్.. ఇలా తనకు తను ధైర్యం చెప్పుకుని ఎంతో మనో నిబ్బరంతో ఆ వ్యాధి నుండి కోలుకుంది. ఇప్పుడు తాజాగా ఓ వార్తతో సమంత మళ్లీ హాట్‌టాపిక్‌గా మారింది. ఫ్యామిలీమాన్ వెబ్‌సీరిస్ తరువాత ఆమె నటిస్తున్న మరో వెబ్‌సీరిస్ సీటాడెల్ (Citadel) హానీ బన్నీ. ఇటీవల దీని టీజర్ కూడా విడుదలైంది.
త్వరలో ఇది స్ట్రీమింగ్ కూడా కానుంది. సమంత ఈ వెబ్‌సీరిస్ కోసం 10 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ చార్జ్ చేసిందట. ఇది హీరోయిన్స్ పారితోషికాల్లో సౌత్ ఇండియాలోనే సరికొత్త రికార్డ్. గతంలో కూడా సమంత తెలుగు సినిమాలకు అత్యధిక ఫీజునే అందుకుంది. అయితే ఏకంగా 10 కోట్ల పారితోషికం మాత్రం ఇంతవరకు ఏ హీరోయిన్ రెమ్యూనరేషన్‌గా తీసుకోలేదట. ఇప్పుడు ఈ టాపిక్ బాలీవుడ్లో కూడా హాట్‌టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియలో వైరల్‌గా మారింది.
Read Also :
Mr Bachchan | రవితేజ స్టైలిష్ వార్నింగ్.. మిస్టర్ బచ్చన్ ట్రైలర్ న్యూ లుక్
Rishab Shetty | 24 ఏండ్ల నిరీక్షణ.. కాంతార హీరో రిషబ్ శెట్టి కల నెలవేరిన వేళ..!
They Call Him OG | ఓజీతోపాటు మరిన్ని.. పవన్ కల్యాణ్ బర్త్ డేకు అదిరిపోయే ప్లాన్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు!
LK Advani: ఛాతిలో ఇన్ఫెక్షన్.. ఆస్పత్రిలో చేరిన అద్వానీ
Engineering Student | దసరా సెలవులని వచ్చాడు.. ఇంట్లో కుప్పకూలిపోయిన విద్యార్థి
Indigo Flight | బాంబు కలకలం.. అహ్మదాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి బెదిరింపు
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్‌కు భారీ ఊరట
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

