హర్దా, బోఫాల్, ఫిబ్రవరి 6: మధ్యప్రదేశ్లో మంగళవారం ఘోర ప్రమాదం సంభవించింది. బాణసంచా పరిశ్రమలో పేలుడు సంభవించడంతో 11 మంది దుర్మరణం చెందారు.174 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. ఒక అనుమానితుడిని పోలీసులు అదుపులోనికి తీసుకొన్నారు. అధికారుల కథనం ప్రకారం హర్దా పట్టణ శివార్లలో ఉండే ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం సంభవించింది.
గాయపడిన వారిని వివిధ దవాఖానలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ‘మంటలను ఆర్పివేశాం. శిథిలాలను తొలగించాం. దర్యాప్తు కొనసాగుతున్నది. కానీ ప్రస్తుతం సహాయక చర్యలకే మా ప్రాధాన్యం’ అని నర్మదాపురం కమిషనర్ పవన్ శర్మ మీడియాకు తెలిపారు. ప్రమాద తీవ్రత, బాధితులు భద్రత కోసం పరుగులు పెడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యాయి.