Dhiraj Sahu | ఆ డబ్బు నాది కాదు.. కుటుంబానిది.. కాంగ్రెస్‌కు ఎలాంటి సంబంధం లేదు: ఎంపీ ధీరజ్ సాహు
ఐటీ దాడుల విషయమై ధీరజ్ సాహు తొలిసారిగా నోరువిప్పారు. పట్టుబడిన సొమ్ము తనది కాదని.. తమ కుటుంబానికి చెందిందన్నారు. తమది కుటుంబ వ్యాపారమని, అదంతా మద్యం అమ్మకాల ద్వారా వచ్చిందేనని చెప్పారు.
భువనేశ్వర్: ఒడిశాలోని కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు (Dhiraj Sahu) నివాసాలతోపాటు ఆయనకు చెందిన మద్యం డిస్టిలరీలు, దాని అనుబంధ సంస్థలపై ఐటీ సోదాలు ముగిశాయి. ఈ నెల 6 నుంచి 15 వరకు పదిరోజులపాటు కొనసాగిన తనిఖీల్లో రూ.351 కోట్ల నగదు, మూడు కిలోల బంగారం పట్టుబడింది. దేశంలో ఇప్పటివరకు పట్టుబడిన నగదు నిల్వల్లో ఇదే పెద్ద మొత్తం కావడం విశేషం. కాగా, ఐటీ దాడుల విషయమై ధీరజ్ సాహు తొలిసారిగా నోరువిప్పారు. పట్టుబడిన సొమ్ము తనది కాదని.. తమ కుటుంబానికి చెందిందన్నారు. తమది కుటుంబ వ్యాపారమని, అదంతా మద్యం అమ్మకాల ద్వారా వచ్చిందేనని చెప్పారు. ఆ డబ్బుతో కాంగ్రెస్‌కుగానీ, మరే రాజకీయ పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు.
‘ఐటీ రికవరీ చేసిందంతా లిక్కర్ కంపెనీలకు సంబంధించింది. మద్యం అమ్మకాల ద్వారా అది సమకూరింది. తాను ఆ వ్యాపారంలో లేను. ఆ డబ్బంత తనది కాదు. తన కుటుంబానికి, ఇతర కంపెనీలకు చెందింది. దానికి సంబంధించిన ప్రశ్నలన్నింటికీ తమ కుటుంబ సభ్యులు సమాధానం ఇస్తారు. సీజ్ చేసిన డబ్బంతా నల్ల ధనమా లేదా చట్టబద్ధమైనదా అని ఐటీ శాఖ చెబుతుంది’ అని సాహు చెప్పారు.
సాహూకు చెందిన బౌద్ధ్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్‌తోపాటు దాని అనుబంధ సంస్థల్లో ఈ నెల 6న ఐటీ తనిఖీలు ప్రారంభమయ్యాయి. రాంచిలోని సాహు కుటుంబంతోపాటు డిస్ట్రిబ్యూటర్ల ఇండ్లు, కంపెనీల్లోనూ తనిఖీలు చేశారు. ఒడిశా, జార్ఖండ్, పశ్చిమబెంగాల్లోని 30 నుంచి 40 చోట్ల దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.351 కోట్ల నగదుతోపాటు మూడు కిలో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల సందర్భంగా పలు పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి సేకరించిన డాటాను తమవెంట తీసుకెళ్లారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
L Murugan | కేంద్ర మంత్రి పదవికి ఎల్ మురుగన్ రాజీనామా.. బీజేపీని తమిళనాడులో బలోపేతం చేసేందుకేనని ప్రకటన
Farmers Protest | విద్యుత్ సిబ్బంది పట్టించుకోవడం లేదు.. కరెంటు కోసం రైతుల రాస్తారోకో
‘యాసంగిలో రైతులు వరి సాగుకు దూరంగా ఉండాలి’
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Angomcha Bimol | ఆ ఎంపీని సస్పెండ్ చేయండి.. రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేసిన బీజేపీ మహిళా ఎంపీలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

