సోమవారం 01 జూన్ 2020
National - May 12, 2020 , 17:02:33

సీఐ సినిమా స్టంట్‌.. ఐదు వేల జరిమానా

సీఐ సినిమా స్టంట్‌.. ఐదు వేల జరిమానా

భోపాల్‌: సింగం సినిమాలో అజయ్‌ దేవగన్‌.. రెండు కార్లపై నిలబడి బ్యాలెన్స్‌ చేసుకొంటూ విలన్లను వేటాడే స్టంట్‌ అదిరిపోయింది. ఈ స్టంట్‌కు ఎందరో అభిమానులు ఫిదా అయిపోయారు. ఈ జాబితాలో చేరిన మధ్యప్రదేశ్‌కు చెందిన మనోజ్‌ యాదవ్‌ కూడా అజయ్‌ దేవగన్‌ మాదిరిగా రెండు కార్లపై నిలబడి  స్టంట్‌ను విజయవంతంగా పూర్తిచేశాడు. ఈ వీడియో కాస్తా సోషల్‌మీడియాలో వైరల్‌  కావడంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ.5 వేల జరిమానా  విధించారు. ఇలాఉండగా, పోలీస్‌ డ్రెస్‌లో ఉండి స్టంట్‌ చేసిన ఈ వ్యక్తి నిజానికి పోలీసు అధికారే కావడం విశేషం. అయితే, ప్రస్తుతం సస్పెండ్‌ అయి ఇంట్లో ఉన్నాడని పోలీసులు తెలిపారు.


logo