భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్‌యాదవ్ కాన్వాయ్‌కు కూడా కల్తీ బాధ తప్పలేదు. గురువారం రాత్రి రాట్లాంలోని రీజినల్ ఇండస్ట్రీ స్కిల్ అండ్ డెవలప్మెంట్ కాంక్లేవ్‌లో పాల్గొనేందుకు వెళ్తుండగా ఆయన కాన్వాయ్‌లోని 19 వాహనాలు ఒకేసారి బ్రేక్ డౌన్ అయ్యాయి. వాటిని తిరిగి గాడిలో పెట్టేందుకు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.
అంతకుముందే ఓ పెట్రోల్ బంక్‌లో డీజిల్ కొట్టించడంతో అనుమానం వచ్చి తనిఖీ చేయగా డీజిల్ ట్యాంక్‌లో నీళ్లు తేలుతూ కనిపించాయి. వెంటనే విషయాన్ని స్థానిక తహసీల్దార్‌కు తెలియజేయగా, ఆయన వెళ్లి పెట్రోల్ బంక్‌లో తనిఖీలు చేసి సీజ్ చేశారు. అయితే, కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో డీజిల్ ట్యాంక్‌లో నీళ్లు చేరి ఉంటాయని బంక్ సిబ్బంది చెప్పినట్టు తెలిసింది.