రుతు సమస్యలపై లోక్‌సభలో మాట్లాడిన ఎంపీ అనురాధ
MP Chinta Anuradha demands menstrual leave :మహిళల్లో కలిగే నెలసరి సమస్యలపై ఇవాళ లోక్‌సభలో ఎంపీ చింతా అనురాధ మాట్లాడారు. పబ్లిక్, ప్రైవేటు మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవులు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. అత్యవసర అంశాలపై ఆమె ఇ
న్యూఢిల్లీ: మహిళల్లో కలిగే నెలసరి సమస్యలపై ఇవాళ లోక్‌సభలో ఎంపీ చింతా అనురాధ మాట్లాడారు. పబ్లిక్, ప్రైవేటు మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవులు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. అత్యవసర అంశాలపై ఆమె ఇవాళ సభలో మాట్లాడుతూ.. రుతుక్రమ సమస్యలతో బాధపడే మహిళలకు రెండో రోజుల లీవ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నెలసరికి సంబంధించిన లీవ్‌ల అంశం ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉందని, మెన్సెస్ సమస్యలతో ఎంతో మంది మహిళలు బాధపడుతుంటారని, ఒవేరియన్ సిస్ట్ లాంటి సమస్యలతోనూ అనేక మంది మహిళలు ఇబ్బందిపడుతుంటారని ఆమె అన్నారు. ఈ నేపథ్యంలో మెన్స్ట్రువల్ లీవ్ రూపంలో పెయిడ్ లీవ్ ఇవ్వాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. లీవ్ ఇవ్వడం వల్ల మహిళలకు కావాల్సిన రెస్ట్ దొరుకుతుందని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న మహిళలకు తప్పనిసరిగా రెండు రోజుల నెలసరి లీవ్‌లు ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖను ఎంపీ అనురాధ కోరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

